S.Bhavanarayana-యస్.భావనారాయణ, D.B.Narayan-డి.బి.నారాయణ
పరిచయం (Introduction) : యస్.భావనారాయణ, డి.బి.నారాయణ, నిర్మాతలు కాకముందు కె.యస్.ప్రకాశరావు గారి స్టూడియోలో నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ బయటికి వచ్చి, 'బండరాముడు' (1959) మరికొన్ని చిత్రాలు కలిసి తీశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా కంపెనీలు పెట్టారు. దినవహి భాస్కర నారాయణగారు డి.బి.ఎన్. ఫిల్మ్స్, సరిదె భావనారాయణగారు మహేశ్వరి, కౌసల్యా పేర్లతో చిత్రాలు నిర్మించారు. భావనారాయణగారి తొలి సినిమా 'రమాసుందరి' (1960) అయితే, 'పెండ్లి పిలుపు' (1961) డి.బి.నారాయణరావు గారి తొలిచిత్రం. భావనారాయణగారు ఎక్కువగా జానపదాలు నిర్మిస్తే, నారాయణగారు సాంఘికాలే నిర్మించారు. (ఇద్దరి చిత్రాల్లోనూ నేను నటించాను) భావనారాయణగారి సమర్పణలో వై.వి.రావు నిర్మాతగా 'పాల మనసులు' తీశారు. (యస్.ఆర్.పుట్టణ్ణ దర్శకుడు) ఇందులో నేను నటించాను. ముఖ్యమైన పాత్రే. భావనారాయణగారికి ఓ అలవాటుంది. సినిమా పూర్తయిపోయిన తర్వాత నటులకు ఇవ్వవలసిన చివరి దఫా పారితోషికాన్ని, ఉంచేయమంటారు. ''ఇది నా దగ్గర వుండనీయండి. మీకు ఇవ్వాలన్న జ్ఞాపకం వుంటుంది. తర్వాత సినిమాలో ...