బి.సరోజా దేవి ,Saroja Devi B
=================================================== పరిచయం : బి . సరోజదేవి , పాపులర్ తెలుగు నటి . తెలుగు , తమిళం , మలయాళం , కన్నడం , భాషలలో నటిగా యాక్ట్ చేసారు . తన 13 వ ఏట పాటలు పాడేది . అప్పుడే హున్నప్ప భాగవతార్ దృష్టి లో పడి సినిప్రవేశానికి దారితీసింది . 1955 లో మహాకవి కాళిదాస , తో సినీరంగ ప్రవేశం చేసారు . తెలుగులో " పాండురంగ మహత్యం " ఎన్ . టి . రామారావుతో , మొదటి చిత్రము . కొన్నాళ్లు కన్నడ ఫిల్ము ఇండస్ట్రీ కి ఛైర్ పర్షన్ గా ఉన్నారు . బి.సరోజాదేవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి అశేష ప్రేక్షకాభిమాన్ని అందుకున్న నటీమణి బి.సరోజాదేవి. జగదేకవీరుని కథ' సినిమాలో దేవకన్యగా ఎన్టీఆర్‌తో నటించిన తార బి.సరోజాదేవి. ఇపుడు ఆయన పేరిట ఉన్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కర్ణాటకకి చెందిన సరోజాదేవి 1955 నుంచి నటిస్తున్నారు. కన్నడంలో వచ్చిన 'మహాకవి కాళిదాస' ఆమె తొలి చిత్రం. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించారు. సుమారు 170 చిత్రాల్లో నటించారామె.దక్షిణ భారతదేశంలో అనేక అవార...