Posts

Showing posts with the label Naveena(T.V artist)-నవీన(బుల్లితెర నటి)

Naveena, నవీన

Image
పరిచయం (Introduction) : అలౌకికతో అలరించి, 'చంద్రముఖి'లో మేనకగా మెరిసి ప్రేక్షకులకు దగ్గరైంది చిన్ని తెర నటి నవీన. నటిగా, యాంకర్‌గానే కాదు సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ ఏర్పాటు చేసి నిర్మాతగానూ మారిన నవీన అంతరంగమిది. జీవిత విశేషాలు (profile) : మాది చీరాల. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేను చిన్నదాన్ని. చిన్నప్పుడు డాక్టర్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. అయితే పదోతరగతిలో ఉన్నప్పుడు 'నువ్వు సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదా' అని మా ఎదురింట్లో ఉండే ఒకాయన అన్నారు. ఫొటోలు తీయించి స్టూడియోలకూ, దర్శకులకూ పంపారు. పదో తరగతి పరీక్షలు రాశాక అవకాశాల కోసం అమ్మను వెంటబెట్టుకొని వెళ్లా. వెళ్లిన చోటల్లా నిరాశే. ఒకసారి ఓ టీవీ సీరియల్‌ ఆడిషన్‌కి వెళ్లా. 'నటన రానివాళ్లంతా ఎందుకొస్తారు' అని దర్శకుడు నా ముందే అన్నాడు. కృష్టవంశీగారు 'చిన్నదానివి వెళ్లి బాగా చదువుకో' అని తిప్పి పంపారు. బాధగా వెనక్కి వచ్చి ఇంటర్‌లో చేరా. అప్పుడే ఓ స్టూడియోలో నా ఫొటోలు చూసిన దర్శకుడు శ్రీరామ్‌ బాలాజీ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. 'వీరివీరి గుమ్మడి పం...