Sonakshi Sinha, సోనాక్షి సిన్హా
పరిచయం (Introduction) : దబాంగ్ చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమైన హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఆ సినిమా తో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయట. దీంతో పలువురు దక్షిణాది దర్శక నిర్మాతల దృష్టి సోనాక్షి సిన్హా పై పడింది. అందుకే అందరు సోనాక్షి సిన్హా చుట్టూ తిరుగుతున్నారట. సోనాక్షి సిన్హా ప్రస్తుతం కమల్ హాసన్ సరసన "విశ్వరూబం" చిత్రం లో నటిస్తోంది. అయితే తాజాగా ఒక అగ్ర తెలుగు నిర్మాత వెంకటేష్ తో తీయబోయే కొత్త చిత్రం లో సోనాక్షి సిన్హా ని హీరోయిన్ గా పెట్టాలని ఉందట. ప్రిన్స్ మహేష్ బాబును ఇష్టపడనని చెప్పే వారు ఉండరేమో. మహేష్ పై మనసు పడ్డ కథానాయికలలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా చేరింది. సోనాక్షి తన మొదటి సినిమా దబాంగ్‌తోనే ఓవర్ నైట్ స్కోరు కొట్టేసింది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా నాయికా, నాయకులుగా వచ్చిన దబాంగ్ పెద్ద విజయం సాధించింది. దీంతో ఆమెకు పది సినిమాలకు రావాల్సిన క్రేజ్ వచ్చింది. దీంతో ఆమె కోసం నిర్మాతలు వరుస కడుతున్నారు. నిర్మాతలతో పాటు పలువురు హీరోలు కూడా ఆమె కోసం సిఫార్సు చేస్తున్నారంట. బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది ...