పిఠాపురం నాగేశ్వరరావు , NageswararaoPitapuram
పిఠాపురం నాగేశ్వరరావు --తెలుగు సినీ జగత్తులో జంట దర్శకులని, జంట సంగీత దర్శకులని చాలా మందిని చూసాంకాని, జంట గాయకుల నతగ్గవారు మాత్రము మాధవపెద్ది - పిఠాపురం మాత్రమే. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు: విశ్వనాధం - అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు ' పాతర్లగడ్డ ', కానీ, 'చిత్తూరు' నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు. బాల్యం పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటిపేరు కలిపేవారుకారు. పిఠాపురంలో హైస్కూల్ చదువులువరకు చదువుకున్న నాగేశ్వరరావుకి రంగస్థలం మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి , ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ది బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలముతో, 1944 నుంచి వవ్యకళా సమితి వారి నాటకాల్లో నటించటము మొదలుపెట్టారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అను...