Posts

Showing posts with the label Sivarao Kasturi-కస్తూరి శివరావు

కస్తూరి శివరావు-Sivarao Kasturi

Image
------------------------------------------------------- పరిచయం : ప్రేక్షకుల దగ్గర్నుంచి అమితమైన అభిమానం సంపాదించిన తొలి హస్యనటుడు కస్తూరి శివరావు . శివరావుకి సినిమాల్లో వేషాలు వెయ్యకముందే నలుగురులో మంచి పేరు వుండేది . అతను మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు . ఆ వ్యాఖ్యానం సరసోక్తులతో , చమత్కారాలతో , ఉత్సాహభరితంగా వుండేది . ‘ వ్యాఖ్యాత శివరావు ’ అని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు . సినిమా పూర్తయిన తర్వాతనో , మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడో చూడాలని జనం ఎగబడేవారు . ఐతే , అప్పటింకా ఆటోగ్రాఫులు అడగడాలు కరచాలనాలూ రాలేదు . సినీ జీవితం(profile) శివరావు నాటకాల్లో హాస్యపాత్రలు ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. హాస్యం మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. వరవిక్రయం (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. చూడామణి (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో బాగాపడి, ‘శివరావు’ తెలిసాడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, స్వర్గసీమ (1945) తో ఇంకా బాగా తెల...