రామసత్యనారాయణ(నిర్మాత),RamaSatyanarayana(producer)
పరిచయం : సంవత్సరానికి 13 సినిమాలు తీసి రికార్డ్ సృష్టించిన నిర్మాత ... ఈ రామ సత్యనారాయణ . ప్రొఫైల్ : పేరు : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ . ఊరు :పాలకొల్లు , పుట్టిన తేది : 10 సెప్టెంబర్ 1957 . నాన్న పేరు : ఆంజనేయులు - తవుడు ఎగుమతి వ్యాపారము , అమ్మ పేరు : సుబ్బరాజు , కుటుంబము : ఐదుగురు అన్నదమ్ములు , ముగ్గురు అక్కాచెల్లెళ్లు , మతము : హిందూ -ఆర్యవైశ్య , కెరీర్ : విధ్యార్ది కాలము నుండి నాటకాలంటే ఇష్టము .. మహాపిచ్చి . కాలేజి లో " తెరవెనుక " నాటకము లో ప్రైజ్ కుడా వచ్చింది . ఇదే ఊరు నుండి సినిమా ఫీల్డ్ కి వెళ్ళిన దాసరినారాయణరావు , ఈయన అసిస్టెంట్ కోడిరామకృష్ణ గారితో పరిచయాలు పెంచుకొని , దాసరి అభిమాన సంగం ఏర్పాటుచేసి ... వారిని సన్మానించడం ద్వార సిని పరిశ్రమ తో పరిచయాలు పెంచుకున్నారు . 1970 లో పెళ్ళి అయిన తరువాత ఆకివీడు లో " శ్రీనివాస క్లాత్ ఎంపోరియం " అనే బట్టల షాప్ పెట్టి వ్యాపారము చేసేవాడు . సినిమాల పై ఉన్నా అభిమానము తో చినకాపవరం లో " తారకరామా తియేటర్ " నిర్మిచారు . ఇటు వ్యాపారస్తుడు గాన...