ధర్మవరపు సుబ్రహ్మణ్యం , SubramanyamDharamavarapu
Introduction : ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించారు. దూరదర్శినిలో ప్రసారమైన 'ఆనందోబ్రహ్మ' (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర తో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నారు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశారు. కళాశాలలో కథానాయకుడి బృందానికి అర్జంటుగా ఓ చాదస్తపు ప్రిన్సిపల్ కావాలి. ఆ పాత్రకి నప్పేది ఎవరు? నేను చాలా స్ట్రిట్టు అని బిల్డప్పులిస్తూనే సరదాగా కనిపించే ఓ ఎస్సై కావాలి. ఎవరిని ఎంచుకోవాలి? ఇంకెవరు... మన ధర్మవరపు సుబ్రహ్మణ్యమే గుర్తొస్తారు. చివరన అమ్మా... అని దీర్ఘం తీస్తూ డైలాగ్ చెబుతారు. ప్రేక్షకుడి మొహాల్లో చటుక్కున నవ్వులు పూయిస్తారు. అంత లేదు బాబూ... అంటూ చిన్నపాటి హావభావాల్ని ప్రదర్శిస్తారు. ధర్మవరపు భలే... అనిపిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బోలెడంతమంది హాస్యనటులు. అంతమందిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొన్న నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన మాటలు, హావభావాలు ఆయనకి మాత్రమే సొంతం. తెలుగు ప్రేక్షకు...