Posts

Showing posts with the label రఘువరన్

రఘువరన్

Image
రఘువరన్ డిసెంబర్ 11 -1948 లో కేరల రాస్త్రము పాలక్కడ్ జిల్లా,పొల్లన్కోడ్ లో జన్మించారు. చెన్నై దూరదర్శన్ లో ప్రసారము చేసిన సీరియల్ ద్వారా సినీ కెరీర్ ప్రారమ్భమైనది. తమిళము లో మైకళ్రాజ్' చిత్రముద్వారా మణ్చి పేరు లబించినది. 'మిస్టర్ భరత్' చిత్రము ద్వారా తెలుగు లోకి పరిచయమయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన 'పసివాడిప్రాణం' , నాగార్జున హీరోగా నటించిన 'శివ' చిత్రాలలో తిరుగులేని విలన్ గా తన స్థానాన్ని పదిలపరచుకున్నారు. తెలుగు, తమిళ ,మళయాల చిత్రపరిశ్రమలో మంచి విలన్ గా ,కేరక్టర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన దక్షిణాది భాషలలో మొత్తము 150 చిత్రాలలో నటించారు. ణటి 'రోహిణి' తో ప్రేమ వివాహము చేసుకొని కొన్నాళ్లు సుఖముగా ఉన్నారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. హిందీ లో కూడా కొన్ని పాత్రలు చేసారు.భార్యతో విడాకు తీసుకొని ఒంటరిగా వున్న తను 19-మార్చి 2008 న గుండి పోటుతో మరణించారు.