Sports and Film-acting Stars - క్రీడల్లో రాణించి నటించిన మహిళలు
పరిచయం (Introduction) : వారంతా దేశం, ఆయా రాష్ట్రాలు గర్వించదగ్గ క్రీడాకారులు. క్రీడల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అంతేకాదు అందంలోనూ వీరికి వీరే సాటి. వీరి ఆట నయనానందకరమే. కొందరు అంతర్జాతీయ స్థారుులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి అందం నటనవైపు అడుగులు వేరుుంచింది. కొందరు యాడ్గ ఫిల్మ్‌ల్లో నటించగా, మరి కొందరు చలన చిత్రాల్లో అరంగేట్రం చేసి హల్ చల్ చేశారు. తాజాగా గుత్తా జ్వాల ఓ స్పెషల్ సాంగ్ హాట్ హాట్‌గా నృత్యం చేసి యువతను వెర్రెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి నటించిన మహిళల గురించి తెలుసుకుందాం... గుత్తా జ్వాల జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్రలోని వార్ధాలో జన్మించింది. తండ్రి గుత్తా క్రాంతి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా, తల్లి ఎలెన్ చైనాకు చెందిన మహిళ. వీరు కాలక్రమంలో నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే. చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగింది. సిం...