వాణిశ్రీ , Vanisri
---------------------- పరిచయం : వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ మరియు మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచిపేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేలయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాతకధానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచినది. ఈదశాబ్దపు చివరలో శ్రీదేవి మరియు జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార. ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్లి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకుమరియు ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది. ప్రొఫైల్ : పేరు : వానిశ్రీ -స్క్రీన్ నేమ్ ... నటుడు యస్.వి.రంగరావు పెట్టారు., అసలు పేరు : రత్నకుమారి, పుట్టిన తేది : జ.1948, ఆగష్టు 3, పుట్టిన ఊరు : నెల్లూరు . ఆంధ్రప్రదేశ్ , ఇండియా . పిల్లలు : ఒక కొడుకు(యం.బి.బి.యస్.) , ఒక కూతురు (యం.యస్ ). నివాసము : చెన్నై న...