మాళవిక , Malavika(singer)
పరిచయమ : మాళవిక. స్వస్థలం విశాఖ. 'గంగోత్రి'లో పాట పాడాక మకాం హైదరాబాద్‌కి మారింది. బీకాం చదివిన ఆమె స్వర ప్రస్థానం గురించి ఏం చెబుతుందో చదవండి. ''అమ్మ సంగీత ఉపాధ్యాయురాలు. తనే నాకు తొలిగురువు. తరవాత రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. ఏడో తరగతిలో ఉండగా ఈటీవీ 'పాడుతా తీయగా'లో మొదటి స్థానం. పాటలు పాడే అవకాశాలొచ్చాయి. అప్పుడే గంగోత్రిలో మొదటిసారి బాలూ గారితో కలిసి పాడాను..'' అని చెబుతుంది. అది మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల చిత్రాల్లో ఆమె స్వరం వినిపించింది. బిల్లా, ఏక్ నిరంజన్‌లలో ఆమె పాడిన పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మలు విదేశాల్లో నిర్వహించిన సంగీత విభావరుల్లోనూ పాల్గొని మంచి గాయనిగా గుర్తింపు సాధించింది.పదిహేనేళ్లకే గాయనిగా పరిచయమైన మాళవిక ఎన్నో పాటలు పాడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. 'రాజన్న'లో 'అమ్మా అవనీ...' పాటకు నంది అవార్డు గెలుచుకుంది. ప్రొఫైల్ : పేరు : మాలవి పుట్టిన తేది : 06 జూలై. పుట్టిన ఊరు : విశాఖపట్నం , నివాసము : హైదరాబాద్ , * నవ రాత్రుల సమయంలో పాటించే నియమ...