Posts

Showing posts with the label మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి-Mikkilileni RadhakrishnaMurty

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ,Mikkilileni RadhakrishnaMurty

Image
పరిచయం (Introduction) : ప్రముఖ చలనచిత్ర నటులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇకలేరు. మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. మిక్కిలినేనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలూ ఉన్నారు. విజయవాడ సమీపంలోని కోలవెన్నులో బాల్యం, విద్యాభ్యాసం సాగింది. చిరుప్రాయం నుంచే జానపద కళలంటే ఆసక్తి కనబరచిన మిక్కిలినేని నాటక కళాకారుడిగా, సినీ నటుడిగా, సాంస్కృతిక పరిశోధకుడిగా పేరొందారు.సుమారు 150 సినిమాలలో నటించారు . జీవిత విశేషాలు (profile) : పేరు : మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి , ఊరు : గుంటూరు జిల్లా లింగాయపాలెంలో ఆయన జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం : కోలవెన్నులో జరిగినది . పుట్టిన తేదీ :07-july-1914లో, వయసు --95 సం.లు , చదువు : వెటనరీ సైన్స్ లో డిప్లమో , మరణము :22 -02-2011 , భార్య : సీతారత్నం పిల్లలు : ఒక కుమారుడు(వెటనరీ డాక్టర్ ) , ఇద్దరు కుమార్తెలు , మొదటి సినిమా : దీక్ష , కెరీర్ : గాంధీజీ పిలుపుతో 15ఏళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ జాతీయ గీతాలను ఆలపించార...