బెంగుళూరు పద్మ,Bangalore Padma
పరిచయం (Introduction) : సినిమాలు, సీరియళ్లు, స్టేజిప్లేలతో ఆంధ్ర ప్రేక్షకులందరికి సుపరిచితమైన నటి బెంగుళూరు పద్మ. సహాయ నటిగా, నృత్యకారిణిగా, స్టేజి ఆర్టిస్టుగా.. బహుముఖ ప్రజ్ఙావంతురాలామె. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, ఉన్నత విద్యావంతురాలైనా... తన అభిరుచి మేరకు చిత్రరంగం, బుల్లితెరనే ఆశ్రయించారు. ప్రస్తుతం నటన సహా మూవీ ఆర్టిస్ట్‌స అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీవిత విశేషాలు (profile) : పేరు : బెంగులూర్ పద్మ , పుట్టిన ఊరు : విజయవాడ , పెరిగిన ఊరు : హైదరాబాద్ , చదువు : ఎం.ఎ (హిస్టరీ) , నాన్న : అప్పలస్వామి -రైల్వే ఉద్యోగి , అమ్మ : సుశీలా రాణి , భర్త : అరుణ్ కుమార్ - రచయిత , పిల్లలు : 2 అబ్బాయిలు - శ్రీనివాస్ ప్రసాద్(నటుడు) ,గాయత్రీ రావు , కెరీర్ : తన మాటల్లో సినీరంగంలోకి బాలనటిగా నా నాలుగవ ఏటనే ప్రవేశించాను. ‘ఆలుమగలు’ తొలి చిత్రం. ఆ సినిమాలో అల్లు రామాలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించాను. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించారా చిత్రం లో. తర్వాత ‘బొమ్మరిల్లు’ అనే చిత్రంలో బాల నటిగా నటించాను. సహాయ నటిగా చిరంజీవి ‘స్టూవర్ట్‌పురం పోలీస్ స్టే...