శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిచయం (Introduction) :
  • ''ఎస్వీ రంగారావు, మోహన్‌బాబు తదితర నటులను స్ఫూర్తిగా తీసుకొన్నాను. వారి నటనను పరిశీలిస్తూనే నాకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొన్నాన''ని చెబుతున్నారు శ్రీహరి. సోమవారం ఆయన పుట్టినరోజు. ''ఇప్పటిదాకా 75 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాను. ప్రతి సినిమాతోనూ సమాజానికి ఒక మంచి సందేశాన్నిచ్చే ప్రయత్నం చేశాన''ని చెబుతున్న శ్రీహరి ఇటీవల పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
* ''ప్రతి యేడాదీ ఒక విజయం మధ్య పుట్టినరోజును జరుపుకోవడం అలవాటు. ఈ సారి అలా చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. అయినా ఫర్వాలేదు. అప్పుడప్పుడు పరాజయాలు పలకరిస్తుంటేనే విజయం విలువేమిటో తెలుస్తుంటుంది. గతేడాది నేను చేసిన 'డాన్‌ శీను', 'బృందావనం', 'అహనా పెళ్ళంట' చిత్రాలు తృప్తినిచ్చాయి''. * ''బ్రహ్మనాయుడు' చిత్రంతో తెరప్రవేశం చేశాను. 23 యేళ్ల నట జీవితంలో ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా, కథానాయకుడిగా.. ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించాను. ఒక రకంగా చెప్పాలంటే రెండేళ్లకో మలుపు తీసుకొంది కెరీర్‌. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొన్నాను కాబట్టే.. ఇంతదూరం ప్రయాణించాను. వెనక్కి తిరిగి చూసుకొంటే ఎంతో తృప్తి కలుగుతుంది. గతాన్ని గౌరవించే వ్యక్తిని నేను. అందుకే ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా... అనే తేడాలు నాలో కనిపించవు''. * ''యువ కథానాయకులతో కలిసి తెరను పంచుకోవటం ఒక చక్కటి అనుభూతి. కొత్తతరంతో పోటీ పడుతున్నట్టు ఉంటుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లరి నరేష్‌... తదితర కథానాయకులతో కలిసి నటించడం చాలా బాగుంది. వాళ్లలో చక్కటి ప్రతిభ ఉంది. మంచి పాత్ర దక్కిన ప్రతిసారీ యువ కథానాయకులతో కలిసి నటిస్తా. మున్నాభాయ్‌ సీక్వెల్‌ చిత్రాల్లోని సర్క్యూట్‌ తరహా పాత్రల్లో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉంది''. * ''మానవ సంబంధాలను ప్రతిబింబించే పాత్రల్లో నటించడం నాకు చాలా ఇష్టం. అన్నగా నటించిన చిత్రాలు కెరీర్‌లో చాలా ఉన్నాయి. అన్నీ నాకు మంచి పేరే తీసుకొచ్చాయి. ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కినంత కాలం వాటిలో నేను నటిస్తూనే ఉంటాను''.
  • * ''ఇతర భాషల్లో నటించాలి.. మార్కెట్‌ను పెంచుకోవాలి.. అనే ఆశలేమీ నాకు లేవు. అయితే కన్నడంలో 'కోకో' అనే చిత్రంలో ఒక మంచి పాత్ర దక్కటంతో కాదనలేకపోయాను. తెలుగులో 'యమహో యమః', 'టీ సమోసా బిస్కెట్‌' చిత్రాలతో పాటు, జగపతిబాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. 'ఎస్పీ దొర' అనే చిత్రం త్వరలోనే మొదలవుతుంది. ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొన్నాను'' అని అంటారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శ్రీహరి రఘుముద్రి ,
  • పుట్టిన తేదీ : 09-ఆగస్ట్ -1964 , 
  • పుట్టిన ఊరు : యలమర్రు (గ్రా.) పెదపారుపూడి (మం)-కృష్ణా జిల్లా.
  • నివాసం  ఊరు : హైదరాబాద్ ,
  • భార్య : డిస్కొ శాంతి , 
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు -అక్షర (మరణించినది)
  • తోబుట్టువులు : ఇద్దరు - ఈయన రెండోవాడు .
  •  మరణము : 09-అక్టోబర్ -2013'
నటించిన సినిమాలు (filmography ): === As Main Lead ===
  • భైరవ (2010) (ACP Bhaira),
  • దాసన్న (2010) (Dasanna),
  • శ్రీశైలం (2009) (Srisailam (Army Major)),
  • సామ్రాజ్యం (2009) (Sardar),
  • మేస్త్రి (2008) (Hari),
  • సరోజ (2008) (ACP Ravindranath),
  • భద్రాచలం (2008),
  • పోరు (2008),
  • గణపతి (2008),
  • శ్రీ మహాలక్ష్మి (2006) (Lawyer Laxmi Krishna Devaraya),
  • హనుమంతు (2006) (Hanumanthu (Freedom Fighter & double role as his grandson ),
  • ఒక్కడే (2005),
  • కె.డి నెం.1 (2004),
  • గురి (2004),
  • శేషాద్రి నాయుడు (2004),
  • సింహాచలం (2003) (Simhachalam),
  • కూలీ (2003),
  • పషురాం (2002),
  • ప్రిథ్వి నారాయణ (2002),
  • థాంక్ యు సుబ్బారావు (2001)(Subbarao),
  • ఎవడ్రా రౌడీ (2001),
  • ఒరేయ్ తమ్ముడు (2001) (Srinivas Yadav),
  • మా ఆయన సుందరయ్య (2001),
  • అయోధ్య రామయ్య (2000),
  • విజయరామరాజు (2000) (Vijayaramaraju),,
  • బలరాం (2000),
  • పోలీసు (1999),
=== In Major Role ===
  • బ్రిందావనం (2010) (Heroine's uncle),
  • డాన్ శీను (2010) (Narsing (one of the two dons in the city)),
  • ఉల్లాసం (2010),
  • రోమియో (2009),
  • కింగ్ (2008) (Gnaneshwar(Don)),
  • ప్రేమాభిషేకం (2008) ( Hari Bhai (Don) ),
  • ఢీ (2007) (Shankar Goud (Don)),
  • వియ్యాల వారి కయ్యాలు (2007),
  • నువ్వొస్తానంటే నేనోద్దంటాన (2005) (Sivarama Krishna (Heroine's brother)),
  • మహానంది (2005) (Swamy (Faction Leader)),
  • కుబుసం (2002) (Sivaram (Naxal Leader)),
  • ప్రేమ దొంగ (2002),
  • అప్పారావు కి ఒక నెల తప్పింది (2001),
  • శివాజీ (2000),
  • సాంబయ్య (1999),
  • తెలంగాణా (1999),
=== In Supporting Role ===
  • మగధీర (2009) (Sher Khan & Solomon),
  • వేత్తిక్కారాన్ (2009) (Tamil),
  • చెలియా చెలియా చిరుకోపమా (2001),
  • బాగున్నారు (2000),
  • సముద్రం (1999),
  • బొబ్బిలి వంశం (1999),
  • ప్రేమకు వేలయరా (1999),
  • అల్లుడుగారు వచ్చారు (1999),
  • ప్రేయసి రావే (1999),
  • శ్రీ రాములయ్య (1998),
  • ఓ పని పోతుంది బాబు (1998),
  • ప్రేమంటే ఇదేరా (1998) (Muralidhar (Police Officer)),
  • ఆవిడ మా ఆవిడే (1998),
  • బావగారు బాగున్నారా ? (1998),
  • సూర్యుడు (1998),
  • వైభవం (1998),
  • సుభవార్త (1998),
  • రాయుడు (1998),
  • పెళ్ళాడి చూపిస్తా (1998),
  • ముద్దుల మొగుడు (1997),
  • బొబ్బిలి దొర (1997),
  • గోకులంలో సీత (1997) (Hari),
  • వీడెవడండి బాబు (1997),
  • జై బజరంగబలి (1997),
  • రాముడొచ్చాడు (1996),
  • శ్రీ కృష్ణార్జున విజయం (1996) (Duryodhana),
  • అల్లుడా మజాకా (1995),
  • తాజ్మహల్ (1995),
  • ఘరానా అల్లుడు (1995),
  • హెల్లొ బ్రొథర్ (1994),
=== In Minor Role ===
  • రాజ కుమారుడు (1999),
  • స్త్రీ ఫైటర్ (1995),
  • దొరగారికి దొంగ పెళ్ళాం (1994),
  • మేజర్ చంద్రకాంత్ (1993),
  • ముఠా మేస్త్రి (1993),
  • అల్లరి ప్రియుడు (1993),
  • ధర్మ క్షేత్రం (1992),
  • భారతం (1992),
  • కుంతీ పుత్రుడు (1993),
  • మాప్పిల్లై (1989) (Tamil),
Awards
  • నంది అవార్డ్ -Best Supporting Actor in 2005 -నువ్వొస్తానంటే నేనొద్దంటానా.
  • ఫిల్ముఫేర్ అవార్డ్ -Best Supporting Actor Award (Telugu) in 2005- నువ్వొస్తానంటే నేనొద్దంటానా.
సమాజ సేవలో శ్రీహరి :
  • శ్రీహరి తన కూతురు ‘అక్షర’ పేరుతో అక్షర ఫౌండేషన్ సంస్థని స్థాపించి మేడ్చల్‌కు చెందిన మూడు గ్రామాలైన అనంతారం, నారాయణపూర్, లక్ష్మాపూర్‌లను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని, వారి పిల్లలకు బట్టలు, ప్లేట్లు ప్రతి సంవత్సరం అందిస్తూ తన సేవలందిస్తున్నారు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలని గత కొంతకాలంగా రహస్యంగా ఉంచిన శ్రీహరి ఈమధ్యే వాటిని బహిర్గతం చేసారు. ఎందుకంటే తాను చేస్తున్న ఈ చిరు సహాయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ఉదార స్వభావులు ముందుకొస్తే, మరిన్ని గ్రామాలు పచ్చగా వుంటాయని అందుకే ఇంతకాలం చేస్తున్న సేవలను బహిర్గతం చేయలేదని చెప్పారు. ఇకనుంచి తన సంపాదనలో సగభాగం అక్షర ఫౌండేషన్‌ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికోసం వెచ్చిస్తానని దాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తానని హీరో శ్రీహరి చెబుతున్నారు.
  • =============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni