వాహిని కుమారి , Vahini Kumari
---------------------------------------- పరిచయము : వాహిని కుమారి పాతకాలపు తెలుగు సిని నటి . ' వాహినీ ' కుమారిగా ప్రసిద్ధి చెందిన రాజకుమారి.......మద్దెల నాగరాజకుమారి గత తరం ప్రేక్షకులకు అప్పటి నటీమణులలో చిరపరిచితమైన పేరు. 'దశావతారాలు ' ఈమె మొదటి ఫిల్మ్ , ఈ సినిమాలోమూడు పాత్రలు పోషించినది , లక్ష్మి ,సీత , యసోధర ,. ఈమె రెండెవ సినిమా - అమ్మ(1939). 1940 లో ఈమె వాహిని పిచర్స్(Vahini picturs) లో ప్రవేశించినది . అప్పటి నుండి , వాహిని కుమారి గా పిలువబడేది . బయోగ్రఫి : పేరు : వాహిని కుమారి . అసలు పేరు : మద్దెల నాగ రాజ కుమారి . పుట్టిన స్తలం : తెనాలి . తండ్రీ : వెంకటేశ్వరరావు , తల్లి : రామామణి , భర్త : భాష్యకార్లు గారు . కొడుకు : గంగాధర్ .(ఒక్క సంతానమే) నివాసము ; విజయవాడ . మరణము : 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు. . కెరీర్ (career) : తెనాలికి చెందిన మద్దెల నాగరాజకుమారి అందం 1934 లోనే సి. పుల్లయ్య గారి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోను, వేల్ పిక్చర్స్ వారి ' సీతాకళ్యాణం ' చిత్రంలోనూ అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేట...