Posts

Showing posts with the label Vinaya prasad-వినయ ప్రసాద్(actress)

Vinaya prasad-వినయ ప్రసాద్

Image
    పరిచయం (Introduction) :   తెర మీద... పెద్ద బొట్టూ, కాటన్‌ చీర కట్టూ... కన్నీళ్లు పెట్టించే పాత్ర. తెర వెనుక... ఎప్పుడూ నవ్వుతూ సందడిగా గడిపే మనస్తత్వం! థియేటర్‌లో... ఆమె నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు ఇంట్లో... సెంటిమెంట్‌ పండించే ఆమె పాత్రలు చూసి నొచ్చుకుంటారు. . .కన్నడ నటి ''వినయ ప్రసాద్‌''. 1995లో నాయుడుగారి కుటుంబం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యా. తెలుగు ,కన్నడ ,తమిళ . మళయాల భాషా సినిమాలలో నటించారు జీవిత విశేషాలు (profile) :   పేరు : వినయ ప్రసాద్ ,  పుట్టిన ఊరు : ఉడిపి  ,  నాన్న : ఎల్.ఐ.సి . ఉద్యోగి,  అమ్మ : బి.ఇ .డి  - కాలేజీ లో క్రాఫ్ట్ టీచర్ ,  బాల్యము :  తనమాటల్లో నాన్న నాకు ప్రతిరోజూ కథలు చెప్పేవారు. హావభావాలతో సహా వర్ణించేవారు. నాలుగో ఏటే ఓ నాటకంలో నటించి మొదటి బహుమతి అందుకున్నా. ఇక స్కూల్లో చేరాక ఆలిండియా రేడియోలో పని చేశా. సంగీతం, యోగా నేర్చుకున్నా. ఖాళీగా ఎప్పుడూ లేను. సినిమాల ప్రభావం నామీద అంతగా లేదు. కానీ కె.విశ్వనాథ్‌గారి సినిమాలు ఉడిపి, మంగళూరులో విడుదలయ్యేవి. 'సిరిసిరిమువ్వ'...