వీళ్లందరిదీ.. ఒకే వూరు!
పరిచయం (Introduction) : వీళ్లందరిదీ.. ఒకే వూరు! అనుష్క... చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ప్రాధాన్యమున్న పాత్ర చెయ్యాలంటే మొదట వినిపించే పేరు తనదే. ఐశ్వర్యారాయ్... భారత దేశం గర్వించదగ్గ అందాల తారల్లో ఆమెది ఓ ప్రత్యేక స్థానం. వీళ్లేకాదు, దీపికా పదుకొణె, పూజాహెగ్డె, జెనీలియా, శిల్పాశెట్టీ... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రస్థానం. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... వాళ్లందరి సొంతూరు మాత్రం ఒక్కటే. అదే మంగళూరు. ఐశ్వర్యారాయ్... ప్రపంచ సుందరిగా ఎంపికై భారత దేశ కీర్తిని పెంచడమే కాకుండా తన ప్రతిభతో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకుంది ఐశ్వర్యారాయ్. కానీ ఆమె అసలు దక్షిణాది అమ్మాయనే విషయం చాలా మందికి తెలియదు. అవును, తను పుట్టింది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న మంగళూరులో. తండ్రి క్రిష్ణరాజ్ రాయ్, స్థానిక నౌకాశ్రయంలో మెరైన్ ఇంజినీర్. తల్లి బృందారాయ్ రచయిత. ఆమె పూర్వీకులు తుళు భాషను మాట్లాడే వర్గానికి చెందినవారు. అందుకే, తన మాతృ భాష తుళు అని చెబుతుంది అందాల ఐశ్వర్య. అనుష్క... చూడ్డానికి పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. నటించే సినిమాలు కూడా ఎక...