Posts

Showing posts with the label Mukhesh Rishi-ముఖేష్ రిషీ (విలన్‌ నటుడు)

Mukhesh Rishi-ముఖేష్ రిషీ (విలన్‌ నటుడు)

Image
    పరిచయం (Introduction) :      ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేని ప్రతినాయకుడు ముఖేష్‌ రుషి. విలన్‌గా నటించడం చాలా సులువు అని చెబుతున్న ముఖేష్‌... తన జీవితంలోకి ఏవీ అంత సులభంగా రాలేదంటున్నారు. తన సినీ జీవిత ప్రస్థానం గురించి ఇలా చెబుతున్నారు. లైఫ్‌ ఈజీ కాదు. ఏదీ ఎవరికీ సులభంగా రాదు. అయితే, జీవితాన్ని ఈజీగా మార్చుకునే ఫార్ములా ఒకటి ఉంటుంది! దాన్ని ఎవరికివారు తెలుసుకోవాల్సిందే. ఎవరికివారు తయారు చేసుకోవాల్సిందే. ఈరోజున మీరంతా నన్ను ఒక మంచి నటుడిగా గుర్తిస్తున్నారు. ప్రేమాభిµమానాలని పంచుతున్నారు. ప్రస్తుతం నాకు చేతినిండా సినిమాలున్నాయి. ఇక్కడ ఎంతోమంది మంచి మిత్రులు దొరికారు. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. నిజానికి ఇవేవీ నా జీవితంలోకి ఈజీగా వచ్చినవి కావు! కాలేజీలో ఈజీగా...! మా కుటుంబ సభ్యులకు తెలిసిన ఈజీ పని స్టోన్‌ క్రషింగ్‌ వ్యాపారం. మా తాతల దగ్గర్నుంచీ నాన్న... అన్నయ్య... అందరూ వ్యాపారంలోనే ఉన్నారు. తరతరాలుగా తెలిసిన పనీ... సులువుగా చేసుకోదగ్గ పనీ కాబట్టి నేనూ పెద్దయ్యాక వ్యాపారమే చేయాలి! ఇంట్లో వాళ్ల ఆలోచన ఇది. మరి నా ఆలోచన... నిజాన...