వరలక్ష్మి జి.,Varalaxmi G
పరిచయం : రికపాటి వరలక్ష్మి అందరికీ జి.వరలక్ష్మి గా సుపరిచితురాలైన అలనాటితెలుగు సినిమా నటీమణి . 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళసినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది. ఈమె బాల్యమునుండి మంచి గాయని . 11యేళ్ల వయసులో ఇళ్లు వదిలి విజయవాడ చేరుకొనితుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థలనటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి సక్కుబాయి మరియు రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు మరియు హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డిలో తీసిన వ్యంగ్య హాస్య 'చిత్రం బారిష్టర్ పార్వతీశం ' సినిమాతో వరలక్ష్మినిచిత్రరంగానికి పరిచయం చేశాడు.౧౯౪౦ ప్రొఫైల్ : పేరు : గరికపాటి వరలక్ష్మి , పుట్టిన తేది : వరలక్ష్మి 1926లో - పుట్టిన స్థల మ : ఒంగోలులో జన్మించింది. భర్త : వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. ...