గురజాడ కృష్ణదాసు వెంకటేష్, G.K.Venkatesh
******************************************************************************* పరిచయం : జి . కె . వెంకటేష్ లేదా గురజాడ కృష్ణదాసు వెంకటేష్ ( సెప్టెంబర్ 21, 1927 - నవంబర్ 1993) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు . ఈయన తెలుగు , తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960 ల నుండి 1980 ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు . ప్రొఫైల్ : పేరు : జి . కె . వెంకటేష్ జన్మస్థలం : హైదరాబాదు . పుట్టిన తేది : 21 సెప్టెంబర్ 1927 , మరణము : *-నవంబర్ 1993 , కెరీర్ : తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో ఎమ్మెస్ విశ్వనాధన్ తో కలసి పనిచేశారు . సంతోషం అనే చిత్రం ( ఎన్టీ రామారావు కథానాయకుడు ) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు . కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీత దర్శకునిగా వెలుగొందారు . తెలుగులో తొలిసారిగా నాటకాల రాయుడు ( భగవాన్ హిందీ చిత్రం అల్బెలా చిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది ) ద్వారా పరిచయమయ్యారు . తర్వాత జమీందారు గారి అమ్మాయి చిత్రానికి సంగీతమిచ్చారు . ఎస్...