ప్రత్యగాత్మ-కె. , Pratyagatma.K
============================ పరిచయం : కోటయ్య ప్రత్యగాత్మ తెలుగు సినిమా దర్శకుడు . చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగానూ కొనసాగారు కె. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఈయన బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు. ప్రొఫైల్ (జీవిత విశేషాలు): పేరు : కొల్లి ప్రత్యగాత్మ , తండ్రి : కొల్లి కోటయ్య వర్మ , తల్లి : కొల్లి అన్నపూర్ణమ్మ , భార్య : అన్నపూర్ణ , సోదరుడు : కె .హేమాంబరదరరావు (సినీ దర్శకుడు), పెద్దకుమారుడు : కె.వాసు (హాస్య చిత్రాల దర్శకుడు ), ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడ దగ్గర ముదునూరు లో జన్మించాడు. ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో ప్రజాశక్తి లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రిక...