Keerthi TV actress-కీర్తి .చిన్ని తెర నటి
పరిచయం (Introduction) : డాక్టర్ కావాలనుకుని యాక్టరయిన ఓ అమ్మాయి... ఆకట్టుకునే నటనతో తెలుగునాట ఇంటింటా పరిచయమైంది. ఈటీవీ 'తూర్పు పడమర'తో సీరియళ్ల ప్రస్థానం మొదలుపెట్టిన కీర్తి... తన చిన్ని తెర ప్రయాణం గురించి ఇలా చెబుతోంది. హాయ్, నా అసలు పేరు కీర్తి. మా అక్క మంజుల (చంద్రముఖిలో నటిస్తోంది)ని ఆదరించినట్లే నన్నూ మీరు అక్కున చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు చక్కగా మాట్లాడుతున్నా. హైదరాబాదీ అమ్మాయిగా గుర్తింపు పొందుతున్నా కానీ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. అందరిలోనూ నేనే చిన్నదాన్ని. దాంతో బాగా ముద్దు చేసేవారు. నాన్న స్టేజి ఆర్టిస్టు కావడంతో ఎప్పుడూ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండే వారు. నాన్నని గమనిస్తూ, నేనూ అనుకరించేదాన్ని. నటన పట్ల నాకున్న ఆసక్తిని గమనించి, నాన్న కొన్ని నాటకాల్లో నాకు అవకాశమిచ్చారు. అలా ఓసారి నాటకం వేస్తున్నప్పుడు, నన్ను చూసిన కన్నడ దర్శకుడు ఓ సినిమాలో బాలనటిగా నటించే అవకాశం ఇచ్చారు. అది పెద్ద హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. కాస్త పెద్దయ్యాక హీరోయిన్‌గానూ అవకాశాలు రావడంతో, నాలుగు కన్నడ సిని...