పి.పుల్లయ్య, P.pullayya
photo : courtesy with paathaBangaram by Ravikondarao /Eenadu cinema paper పరిచయం (Introduction) : పి.పుల్లయ్య- మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. పరిశ్రమలో ఒక పెద్ద మనిషిగా ఎప్పుడూ గౌరవాన్నే అందుకున్నారు. దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షులుగా చాలాకాలం పనిచేశారు. ఎక్కువగా ఇంగ్లీషు మాట్లాడేవారు. దాదా సాహెబ్ ఫాల్కె వద్ద సినిమా శాస్త్రం అభ్యసించారు. 1935 లోనె కొల్హాపూర్ లో నిర్మించిన " హరిశ్చంద్ర"చిత్రానికి పనిచేశారు. అద్దంకి కి అది ఆరంభ చిత్రం . తర్వాత 1937 లో తన సతీమణి , గాయని శాంతకుమారి, బందా కనకలింగేశ్వరరావుతో 'సారంగధర', అటుపిమ్మట శాంతకుమారి, సి.యస్.ఆర్.లతో 'శ్రీ వెంకటేశ్వర మహాత్యమ్" రూపొందించి. సినీ రంగం లో స్థిరపడిపోయారు. జీవిత విశేషాలు (profile) : పేరు : పి.పుల్లయ్య , పుట్టినతేదీ : 02 -మే- 1911 , పుట్టిన ఊరు : నెల్లూరు , తల్లి : రంగమ్మ , (నాలుగేళ్ళ వయసులోనే తల్లిదండ్రులు చనిపోగా మేనత్త ఇంటిలో పెరిగారు), తండ్రి : రాఘవయ్య , చదువు : బి.ఎ. ఉద్యోగము :...