లక్ష్మి కాంతం బలిజేపల్లి , LakshmiKantham Balijepalli
- ---------------------------------------------------------------------------------------- పరిచయం : లక్ష్మి కాంతం కవి మరియు నటుడు , సత్య హరిశ్చంద్ర ఈయన మూలము గా వెండి తెర కెక్కినది , ఆనాటికాలములో తెలుగు భాషను నలు దిశల ఖ్యాతి కెక్కిన ఘనత ఈయనదే, తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు. ప్రొఫైల్ : పేరు : బలిజేపల్లి లక్ష్మీకాంతం , ఊరు : ఇటికం పాదు - బాపట్ల తాలూకా , గుంటూరు జిల్లా , పుట్టిన తేది : 23 డిసెంబర్ 1881 , తండ్రి : నరసింహ శాస్త్రి , తల్లి : ఆదిలక్ష్మమ్మ , మరణము : 30 జూన్ 1953 న కాళహస్తి లో చనిపోయారు , చదువు : తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలొనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివినారు . ఉద్యోగం : సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉప...