Posts

Showing posts with the label మమత హాస్యనటి

మమత హాస్యనటి, Mamatha Commedian

Image
ఆమె 1978లో తొలిసారిగా భూమి కోసం చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య నటిగా సినీ ప్రియులను అలరించిన నటీమణి మమత (55) చెన్నైలో మరణించారు. సోమవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలుగు చిత్రాలతో పాటు దక్షిణాది భాషల చిత్రాలన్నింటా మమత హాస్యనటిగా రాణించారు. కారుదిద్దిన కాపురం చిత్రంలో మంచి నటన కనబరచి ప్రశంసలందుకున్న మమత, చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. దాదారు 250కు పైగా చిత్రాల్లో నటించిన మమత రాజబాబు, నాగేష్ మరియు అల్లు రామలింగయ్య వంటి ప్రముఖ హాస్యనటులందరి సరసనా నటించారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు మారిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ సినిమాలకు, సీరియళ్లకు డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు. ఆమె గజదొంగ, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె మృతికి చెన్నైలోని డబ్బింగ్ కళాకారులు సంతాపం ప్రకటించారు. నటించిన చిత్రాలు: * భూమి కోసం * గజదొంగ ,* * చుట్టాలున్నారు జాగ్రత్త ౧౯౯౪ : నిరీక్శే ( కావేరి ) ౧౯౮౯ : చలాకి ...