Raj Kumar(kannada)-రాజ్ కుమార్( కన్నడ)
పరిచయం (Introduction) : కన్నడ కంఠీరవుడు మరియు రాజ్ కుమార్ గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు . లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధధ గుడి మరియు జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు. మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటిచిన చిత్రాలకే కాక, నేపథ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు. జీవిత విశేషాలు (profile) : పేరు : రాజ్ కుమార్ , పూర్తిపేరు : డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు, పుట్టిన తేదీ : ఏప్రిల్ 24, 1929 –, గజనూర్ (గ్రా) కర్...