Posts

Showing posts with the label Venugopalacharyulu Aacchi

ఆచ్చి వేణుగోపాలాచార్యులు , Venugopalacharyulu Aacchi

Image
పరిచయం : పట్నంలో శాలిబండ'... నాటి తరంవారికి ఎంతో పరిచయమున్న జానపద గీతం. దీన్ని 'అమాయకుడు' చిత్రం కోసం రాశారు గీత రచయితా దర్శకులూ ఆచ్చి వేణుగోపాలాచార్యులు. ఆ పాటకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన ఇలా పంచుకున్నారు. అది 1968 ప్రాంతం... హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజులవి. అప్పటికే అడపాదడపా సినిమాలకి పాటలు రాసేందుకు చెన్నై వెళ్లి వస్తూండేవాణ్ని. ఆ రోజుల్లోనే రాజ్‌కపూర్‌ నటించిన 'అనాడీ' విడుదలై సూపర్‌హిట్‌ అయింది. దాన్ని తెలుగులో పునర్నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. కొంతమంది మిత్రులు నిర్మాతలుగా ఉంటామన్నారు. సరే, హీరో ఎవరు? ఎన్టీ రామారావుగారో నాగేశ్వరరావుగారో అనుకున్నాం. అప్పట్లో వాళ్లు యాభై అరవైవేలు పారితోషికం తీసుకుంటున్నారు. మేం అంతకంటే తక్కువ బడ్జెట్‌లో చేద్దామనుకున్నాం. వేరే హీరో కోసం హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌ వెళ్లాం. కృష్ణగారిని కలుద్దామని వెళ్తే ఆయన షూటింగ్‌లో బిజీగా ఉన్నారని తెలిసింది. రెండుమూడ్రోజులు తరువాత ఆయన్ని కలిసి విషయం చెబితే ఓకే అన్నారు. హీరోయిన్‌గా జమున నటిస్తామన్నారు. అలా వెుదలైంది 'అమాయకుడు' చిత్రం. ఆ చిత్రాని...