Posts

Showing posts with the label Mano (singer)

మనో (గాయకుడు) , Mano (singer)

Image
పరిచయం : మనో (సింగెర్) -బాలు తో పాడటం నా కెరీర్‌కు ఉపయోగపడింది. అందువల్లే ఎక్కువ పాటలు పాడగలిగాను అని గాయకుడు మనో అలియాస్ నాగూర్ బాబు పర్కొన్నారు. అన్ని భాషల్లో 21వేల పాటలు పాడారు. రజనీకాంత్ తదితర ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు మనో సంగీత దర్శకుడిగా మారారు. తన మాటల్లో : అలీ హీరోగా నటిస్తున్న 'సోంబేరి' చిత్రానికి ఆయన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా మనో విలేకరులతో మాట్లాడుతూ 'బాల నటుడిగా దాసరి నారాయణరావు గారు పరిచయం చేశారు. అయితే సంగీతం అంటే చిన్నతనం నుండీ ఇష్టం. ఒక సందర్భంలో నా ప్రతిభను గుర్తించిన ఎమ్మెస్ విశ్వనాధన్ గారు తన ఆసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. తర్వాత చక్రవర్తి గారి దగ్గర చేరాను. ట్రాక్స్ పాడేవాడిని, అలా అవకాశాలు పెరిగి గాయకుడిగా రాణించాను. తెలుగుతో పాటుగా హింది, తమిళం, మళయాళం, కన్నడ, బెంగాళీ భాషల్లో పాడాను అని తెలిపారు. నటుడిగా, గాయకుడిగా రెండు కాళ్లపై ప్రయాణం మంచిది కాదనే ఉద్దేశ్యంతో నటనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు సంగీతాంకు దర్శకత్వం వహించే అవకాశం రచయిత జొన్నవిత్తుల దర్శకత్వం వహిస్తున్న 'సోంబేరి' చిత్రం ద్వారా వచ్చింది. కథ విన్నాకే ...