Posts

Showing posts with the label Raghava K ( రాఘవ కె )producer

Raghava K , రాఘవ కె .

Image
పరిచయం (Introduction) : కె.రాఘవకు రఘుపతి వెంకయ్య అవార్డు--2010 తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 'తాతామనవడు' వంటి గొప్ప సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత కె.రాఘవను ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.1940లో గేట్‌ కీపర్‌గా జీవితం ప్రారంభించిన రాఘవకు చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖలలో పనిచేసిన అనుభవం ఉంది.అక్కడే ఉంటూ నృత్యం, ఫైట్స్‌, నిర్మాణ విభాగాల్లో పనిచేశారు. వాసన్‌, శివాజీ గణేశన్‌లతో ఉంటూ వారి చిత్ర వ్యవహారాలు చూసుకొనేవారు. తదుపరి కాలంలో చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగానూ ఉన్నారు. స్వయంగా ఓ చిత్ర నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని తెలుగు, హిందీ, తమిళంలో సినిమాలు తీశారు. 'జగత్‌కిలాడీలు'తో సినీ జీవితం ప్రారంభించారు. దాసరినారాయణరావు, కోడిరామకృష్ణలను ఈయనే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను, సాంకేతిక నిపుణులను చిత్రసీమకు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో డబ్బింగ్‌, రికార్డింగ్‌ థియేటర్‌ను ప్రారంభించారు. ఫిలీంనగర్‌ హౌసింగ్‌ కాలనీలో గృహప్రవేశం చేసిన తొలివ్యక్తి రాఘవ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'అవార్డు రావడం చాలా ఆనందంగా ఉం...