kundu , Gada Balakrishnarao, కుందు ,గాదా బాలకృష్ణారావు
పరిచయం (Introduction) : ఒకే ఒక దృశ్యంలో 5, 6 డైలాగులున్న ఒక చిన్న వేషానికి కావలసిన పాత్రధారి కోసం దర్శక, రచయితలు స్వయంగా వెళ్లి ఎన్నిక చేస్తారా ఎక్కడైనా? ఎక్కడో ఏమిటి - నిజంగా అలా జరిగింది. వాహినివారు 'గుణసుందరి కథ'' (1949) తీసినప్పుడు -అందులో ఒక దృశ్యంలో మహేంద్రమణి అనేది ఎక్కడుందో అంజనం వేసి చూసి తెలుసుకుంటారు. అంజనం ఒక పెద్దాయన వేస్తే - ఒక అబ్బాయి అందులోకి చూస్తూ ఎలా ఎలా వెళ్లాలో వివరిస్తూ వుంటాడు. ఆ అబ్బాయి వేషానికి పనికొచ్చేవాడు ఎవరు? అని - ఆ చిత్రం దర్శకుడు కె.వి.రెడ్డి, రచయిత పింగలి నాగేంద్రరావు, సహకార దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ముగ్గురూ మద్రాసు ఆలిండియా రేడియోకి 'బాలానందం' కార్యక్రమం జరిగే చోటికి వెళ్లారు. అక్కడున్న పిల్లల్ని పరీక్షించారు. 'షడ్జా మడ్జ కరాడ్జ వీడ్జ' అన్న కాళిదాసు శ్లోకంలోని ముక్కలు పలకమని నలుగుదైరుగుర్ని పరీక్షిస్తే ఒక అబ్బాయి భావం ప్రకటిస్తూ స్పష్టంగా చదివాడు. దాంతో ఆ దర్శకుడు వాళ్లూ ఆ అబ్బాయిని ఆ వేషానికి తీసుకున్నారు. ఆ అబ్బాయిపేరు - కుందు. మాస్టర్ కుందు. అసలు పేరు - గాదా 'బాలకృష్ణారావు'. 'కుందు...