Lanka Satyanand-లంక సత్యానంద్(actor,cinema director,Star maker)
Courtesy with : Eenadu news paper sunday magazine 07-09-2014. పరిచయం (Introduction) : అందరికీ తాజ్‌మహల్ అందమే కనిపిస్తుంది. కానీ కొందరే దాని వెనకున్న శిల్పి నైపుణ్యాన్ని గుర్తించేది. పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ... వీళ్లంతా మన వెండితెర తాజ్‌మహళ్లయితే, లంక సత్యానంద్... వాళ్ల వెనకున్న శిల్పి! నటనలో ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్న కుర్రాళ్లు, ఇప్పుడు తెలుగువాళ్లకు సూపర్‌స్టార్లు. ఓ సాధారణ రంగస్థల నటుడు 'స్టార్‌మేకర్ సత్యానంద్. జీవిత విశేషాలు (profile) : పేరు : లంక సత్యానంద్ , ఊరు : విశాఖపట్నం , కెరీర్ : ఇప్పుడు సినిమాలకు ఉన్నదానికంటే రెండింతలు క్రేజ్ అప్పట్లో నాటకాలకు ఉండేది. మా మేనమామ నాటకాలకు దర్శకత్వం చేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కథా చర్చలూ, మేకప్‌లూ, రిహార్సల్స్‌తో ఓ మినీ థియేటర్‌లా ఉండేది. ఇంకా బడి మొహమే చూడని వయసులోనే నాటకాలను చూశా. ఓసారి ఏదో నాటకంలో బాలనటుడు రాలేదని మామయ్య నన్ను నటించమన్నారు. అలా ఏడేళ్ల వయసులో రంగస్థలంపైన రంగప్రవేశం జరిగింది. రంగురంగుల దుస్తులూ, ప్రేక్షకుల చప్పట్లూ,...