భానుప్రియ,Bhanupriya
--------------------------------------------------------------- పరిచయం : భానుప్రియ ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలోకథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, మరియు భరతనాట్యం నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటుంటారు. ఎన్నో చెప్పుకోదగ్గ, గుర్తించుకోదగ్గ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది . అభినయం, అందం కలగలిసిన భానుప్రియ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. తమిళ, హిందీ, మళయాళ సినిమాల్లోనూ నటించింది. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను భానుప్రియ వివాహం చేసుకుంది. వీరికి అభినయ అనే అమ్మాయి ఉంది. వ్యక్తిగత కారణాలతో ఆదర్శ్ కౌషల్ తో విడాకులు తీసుకున్న భానుప్రియ టీవీ, సినిమాల్లో తన క...