Posts

Showing posts with the label మాలతి(పాత తరం )

Malathi(old) , మాలతి(పాత తరం )

Image
  -   పరిచయం (Introduction) :  వాహిని సంస్థ తమ రెండో చిత్రంగా 'సుమంగళి' (1940) తీసింది. బి.ఎన్‌.రెడ్డి దర్శకుడు. కె. రామనాథ్‌ ఛాయాగ్రహకుడు. ఈ సినిమాలోనే మాలతి 'వస్తాడే మా బావ' పాట పాడుతుంది. ఈ పాట చాలా ప్రసిద్ధి పొందింది. మాలతి సొంతంగా పాడింది. గ్రామఫోన్‌ రికార్డులో కూడా ఆమెదే కంఠం. ఈ పాటలని, చిత్రంలో ఆమె మేడ మెట్ల మీద నిలబడి, కొంత పాడి మెట్లు దిగుతూ పాడుతుంది. మేడపైన నిలబడి పాడుతున్నప్పుడు, నేల మీద వున్న కెమెరాకి ఆమె అందదు. ఈ రోజుల్లో వున్నట్లు అప్పుడు క్రేన్‌లు లేవు. అది వేసిన సెట్టు. 20, 25 అడుగుల ఎత్తులో మేడ మెట్ల పైభాగం వుంటుంది. అక్కడ ఆమెకి క్లోజ్‌ షాటు తియ్యాలి. ఆ ఎత్తుకి సరిపడా, నాలుగైదు టేబుళ్ళు ఒక దాని మీద ఒకటి పేర్చి, దాని మీద స్టూలు, మళ్లీ చిన్నాపెద్దా టేబుళ్ళూ నిలబెట్టి, దానిపైన రామ్‌నాథ్‌ ఆపైకి ఎక్కి షాటు తీశారు! ఈ షాటు తీస్తున్న 'వర్కింగ్‌ స్టిల్‌' ఆనాడు తెలుగు సినిమా పత్రికలో అచ్చయితే, చూసిన జ్ఞాపకం బాగా వుంది. ''అసలా టేబుళ్ళు కదలకుండా ఎలా వున్నాయి? అంతపైకి ఎలా ఎక్కగలిగారు?'' అన్న ప్రశ్న నాలాంటివాళ్లకి కలిగింది. ఇంకో...