Boddu Gopalam , బొడ్డు గోపాలం
పరిచయం (Introduction) : బొడ్డు గోపాలం పాత కాలం దక్షిణ భారతదేశం సంగీత దర్శకుడు మరియు గాయకుడు . ఆల్ ఇండియా రేడిలో కొన్నాళ్లు సంగీతాన్ని అందించారు . Vocal Music and playing Violin విధ్యలను విజయవాడ ' వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి దగ్గర నేర్చుకున్నారు . జీవిత విశేషాలు (profile) : పేరు : గోపాలం బొడ్డు , పుట్టిన ఊరు : తుల్లూరు - గుంటూరు జిల్లా , ఫుట్తిన తేదీ : 1927 - 2004 నాన్న : రామదాసు -- హరికథా ఆర్టిస్ట్ /సంగీత కళాకారుడు , రావి కొండలరావు గారి పాత బంగారం లో ఇలా వ్రాసిఉంది > కళాకారుడూ గోపాలంగారు, 1927లో గుంటూరు జిల్లాలో పుట్టి, వయొలిన్ నేర్చుకుని, వయొలిన్‌తోపాటు గాత్రం కూడా నేర్చుకుని- ఎన్నో నాటకాల్లో పాడారు. కొన్నింటికి సంగీతం నిర్వహించారు. కొన్ని నాటకాల్లో నటించారు. ప్రజానాట్య మండలిలో కొంత కాలంపాటు సంగీతం నిర్వహిస్తూ పాటలు పాడేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం చేసిన సంగీత రూపకాల్లో పాటలు పాడడం, పాత్రలు చదవడం చేసేవారు. తాతినేని ప్రకాశరావుగారు 'పల్లెటూరు' (1952) డైరెక్టు చేస్తున్నప్పుడు, ఆయన పిలుపుతో గోపాలంగారు మద్రాసు చేరుకున్నాడు. ఆ సినిమాకి ఘంటసాలగారు సంగీత ద...