కాంతారావు-Kantharao T L
---------------------------------------------------------------- పరిచయం : తాడేపల్లి లక్ష్మీ కాంతారావు ( కాంతారావు ) - ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించాడు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. నారద పాత్ర వేయడం ఈయనకే ప్రత్యేకము . సాంఘిక, జానపద, పౌరాణికాలలో ఆయన తనదైన శైలిలో గుర్తింపు పొందారు. కథానాయకునిగా, ప్రతినాయకునిగా, రెండో హీరోగా కూడా ఎన్నో పాత్రలను ఆయన పోషించారు. పౌరాణిక చిత్రాలలో నారదునిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణా నుండి వచ్చిన నటులలో ఎన్టీఆర్ స్థాయిలో ప్రజా గుర్తింపు పొందిన ఏకైక నటుడు కాంతారావు. వారిరువురి మధ్య ఎంతో స్నేహం ఉండేది. కంచుకోట , ఏకవీర , లవకుశ , పాండవ వనవాసం ఇలా 50 చిత్రాలలో వారు కలసి నటించారు. లవకుశ చిత్రంలో లక్ష్మణుని పాత్రకు వేరొకరిని ఎంపిక చేయగా ఎన్టీఆర్ పట్టుపట్టి కాంతారావుకు ఆ పాత్రను ఇప్పించారని చెబుతారు. తాను శ్రీకృష్ణుని పాత్ర వేయలేని సినిమాలలో కాంతారావునే ఎన్టీఆర్ ఆ పాత్రకు ఎంపిక చేసేవా...