తేజస్విని -Tejaswini (actress)
పరిచయం (Introduction) : ఆనందంతో నోటమాట రాలేదు! అంటుంది నటి తేజస్వి-- తన మాటల్లో.. ఒకప్పుడు తేజస్వి దినచర్య అంటే.. రోజులో కాసేపు కాలేజీలో చదువుకోవడం.. ఆ తరవాత హెచ్‌ఎస్‌బీసీ, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో డాన్స్ తరగతులు నిర్వహించడం. అలా సంపాదించిన డబ్బుని చదువు కోసం ఖర్చు చేసుకోవడం మాత్రమే. మరి ఇప్పుడు.. నటిగా చిత్రీకరణలతో బిజీ. రామ్‌గోపాల్‌వర్మ సినిమాలో కనిపించింది. 'అనుకోకుండా ఇటువైపు వచ్చినా, ఒక్కో సినిమాని వందశాతం అంకితభావంతో చేస్తున్నా' అంటూ ఇలా చెబుతోంది... చాలామంది నాయికలు డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. నేను మాత్రం జర్నలిస్ట్ కాబోయి నటినయ్యా. అవును, నాకు ముందునుంచీ జర్నలిస్ట్ కావాలని కోరిక. నేను సినిమాల్లోకి రావడానికి ఒకవిధంగా అది కూడా కారణమే. మా సొంతూరు కృష్ణాజిల్లా. నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ రకరకాల చోట్లకు బదిలీ అయ్యేది. అయితే నా చిన్నప్పుడే హైదరాబాద్‌కి వచ్చేయడంతో నా చదువంతా ఇక్కడే సాగింది. చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నా. క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టా. నా స్నేహితురాలు వాళ్లక్క ఓసారి నా గురించి తెలుకుని...