L.R.Eswari (singer)-ఎల్.ఆర్.ఈశ్వరి (గాయని)
పరిచయం (Introduction) : ఎల్.ఆర్.ఈశ్వరి-దక్షిణభారత దేశం నేపద్య గాయకురారు. దాదాపు పధ్నాలుగు భాషల్లో పాటలు పాడి తన స్వరాన్ని శ్రోతల మదిలో సుస్థిరపరిచినారు. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించింది. తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్లము మొదలగు 14- భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది. జీవిత విశేషాలు (profile) : పేరు : ఎల్.ఆర్.ఈశ్వరి , ఊరు : పరమకుడి (తమిళనాడు ), పుట్టిన ఊరు : చెన్నై , పుట్టిన తేదీ : 08-డిసెంబర్ , చదువు : ఎస్.ఎస్.ఎల్.సి, నాన్న : ఆంటోని - ఎల్.ఆర్ ఈశ్వరి చిన్న తనము(5 ఏళ్ళు)లోనే చనిపోయారు. అమ్మ : రెజినామేరి నిర్మల-మంచి గాయని , నమ్మిన దేవత : వేలాంగిణి మాత . ఈమాతను రాజేశ్వరి అంటారు, అమ్మతరపువాళ్ళు " లూర్ద్...