J.V.Raghavulu - జేవీ రాఘవులు
పరిచయం (Introduction) : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం రాజమండ్రిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తొలుత ఆయన ఘంటసాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1970లో వచ్చిన 'ద్రోహి' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 172 సినిమాలకు సంగీతం అందించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : జే.వీ రాఘవులు, ఊరు : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. భార్య : బంధువుల అమ్మాయి- రమణమ్మ , పిల్లలు : 4 అబ్బాయిలు --వెంకటేశ్వరరావు , భాష్కర్ , శ్యమ్‌కుమార్ , రవికుమార్ . ఒక అమ్మాయి - లక్ష్మి . సినిమాలు (filmography ): జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, ఎవడబ్బ సొమ్ము, నా ఇల్లు నా వాళ్లు, రంగూన్ రౌడీ, సంసార బంధం, మొగుడు కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ముక్కుపుడక, 20వ శతాబ్దం, కోతలరాయుడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు తదితర సినిమాలకు జేవీ సంగీతం అందించారు. =================================== visiti my we...