అమ్మ తో నటీ నటులు , Celebrities with Moms
పరిచయమ : అమ్మ ప్రేమ సృష్టిలో విలువ కట్టలేని ప్రేమ అమ్మ ప్రేమ సృష్టిలో పొందే కమనీయమయిన ప్రేమ అమ్మ ప్రేమ సృష్టిలో పొందే మధురమయిన ప్రేమ అమ్మ ప్రేమ పొందేకొద్దీ తరగని ప్రేమ అమ్మ ప్రేమ పంచేకొద్దీ పెరిగే ప్రేమ అమ్మ ప్రేమ కను రెప్పకన్నా మిన్నగ చూసుకునే ప్రేమ అమ్మ ప్రేమ నేను పలికిన మొదటి పలుకు అమ్మ నేను చుసిన మొదటి రూపము అమ్మ నేను విన్న మొదటి మాట అమ్మ ఆకలి గమనించి కడుపు నింపే ప్రేమ అమ్మ ///డా.శేషగిరిరావు - శ్రీకాకుళం /// --------------------------------------------------- అమ్మ గురించి తారలు చెప్పిన కబుర్లు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం' అని ఒకరంటే 'నా అందం వెనుక రహస్యం మా అమ్మే' అంటారు మరొకరు. 'అమ్మ పక్కన లేనిదే అడుగు కూడా బయట పెట్టను' అని ఇంకొకరంటారు. అలా అని వీళ్లేం సాధారణ మహిళలు కాదు. అందం అభినయంతో గ్లామర్ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈముద్దుగుమ్మలంతా తమ విజయం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమ్మే ఉందంటున్నారు. -------------------------------------------------- Zarine and Zayed Khan ------------------------------...