రామజోగయ్య శాస్త్రి-గీతరచయిత , Ramajogayya Sastry (Lyricist)
పరిచయము : అదుర్స్'... 'చారీ..' 'చంద్రకళా..' నవోవెంకటేశలో... అన్నీ. ఏక్‌నిరంజన్‌లో... టైటిల్‌సాంగ్. గో.గో.గోదావరి... 'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే..' గతంలోకి కాస్త తొంగిచూస్తే గీతరచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఇలాంటి హిట్ పాటలెన్నో. జీవిత విశేషాలు (ప్రొఫిల్) : పేరు :రామజోగయ్య శాస్త్రి, ఊరు : ముప్పల - గుంటూరు జిల్లా , పుట్తిన తేదీ : చదువు : ఎం.టెక్ (ఇంజినీరింగ్ ), కుటుంబము : అమ్మ : నాన్న : భార్య : పిల్లలు : తోబుట్టువులు : కెరీర్ : తన మాటల్లో -> ఐదారు తరగతుల్లోనే సినిమాల ప్రభావం వెుదలైంది. పాటలు విన్నవి విన్నట్టుగా పాడేవాణ్ని. అందుకు నాకున్న సోర్స్... మాఊరు ముప్పాళ్లలో ఓ టూరింగ్ టాకీస్, అప్పుడప్పుడూ హైస్కూల్ గ్రౌండ్‌లో వేసే తెరబొమ్మలు. అప్పట్లోనే టేప్‌రికార్డర్లు వచ్చాయి. ప్రేమాభిషేకం, కొండవీటి సింహం వంటి పాటలు తెగ వినిపించేవి. దీనికితోడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఓ పీరియడ్ ఉండేది. అందులో నాపాట తప్పనిసరి. మా డ్రిల్ మాస్టారు సాయంత్రంపూట ట్యూషన్స్ చెప్పేవారు. నాతో పాడించాకనే ట్యూషన్ విడిచిపెట్టేవారు. మరోపక్క... మా బావగారు సాంఘిక నాటకాల...