రమణారెడ్డి,Ramanareddy
-------------------------------------------- పరిచయం : తెలుగు సినిమా హస్యనటుల్లో రమణారెడ్డి ప్రముఖుడు. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక సినిమాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు. ప్రొఫైల్ (జీవిత విశేషాలు) : పేరు : తిక్కవరపు వెంకట రమణా రెడ్డి , పుట్టిన తేదీ : 1 అక్టోబర్ 1921, పుట్టిన ఊరు : జగదేవిపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా మరణించిన తేదీ : 11-నవంబర్-1974 లో చనిపోయారు. కెరీర్ : వకుశ సినిమాను నిర్మించిన శంకరరెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా మాయపిల్ల లో వేషం వేశాడు. ఆ సినిమాకి రఘపతి వెంకయ్య కుమారుడైన ప్రకాశ్ డైరెక్టరు. శంకరరెడ్డి, అతనూ కలిసి ఆ సినిమా తీశారు. అందులో - వాహినివారి సుమంగళి, దేవత సినిమాల్లో నటించిన కుమారి హీరోయిన్. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా, చిత్రం సరిగా నడవకపోడంతో అది పదిమంది దృష్టిలో పడలేదు. , చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకీ, పరిశ్రమకీ బాగా తెలిసింది. బంగారుబాల లో ముక్కుగొంతుపెట్టి మాట్లాడినట్ట...