Amy Louise Jackson(actress)-అమీ లూయీ జాక్సన్(నటి)
- పరిచయం (Introduction) : రామ్‌చరణ్,శృతిహాసన్,అమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది .. అమీ జాక్ సన్. దక్షిణ బారత భాషా సినీపరిశ్రమలోను , హిందీ సిన్మాలలోనూ నటించారు . 2009 లో ''మిస్ టీన్ వరల్డ్ '' టైటిల్ గెలుచుకున్నారు. అమీ లూయీ జాక్సన్... ఇంగ్లండ్ అమ్మాయి అయినా తెలుగు సినిమాల్లో చక్కగా ఒదిగిపోతోంది. 'ఎవడు'లో రామ్‌చరణ్ పక్కన తళుక్కుమంది. ఇప్పుడు శంకర్ సినిమా 'మనోహరుడు'లో విక్రమ్‌తో జతకట్టింది. బాలీవుడ్, తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ : భారతీయ సినిమాలతో ఒకప్పుడు అమీకి ఏమాత్రం పరిచయం లేదు. బ్రిటన్‌లో మోడల్‌గా ఉన్నప్పుడు ఓ వెబ్‌సైట్‌లో తమిళ నిర్మాతలు ఆమె ఫొటోను చూశారు. 'మదరాస పట్టణం' అనే సినిమా కోసం ఎంపిక చేశారు. అలా మొదటిసారి నేరుగా హీరోయిన్‌గా భారత దేశంలో అడుగుపెట్టింది. ఆ సినిమా కథ కూడా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అది హిట్టవడంతో వరసగా అవకాశాలు రావడం మొదలైంది. తెలుగులో '1947- ఎ లవ్ స్టోరీ' పేరుతో అద...