కోలీవుడ్‌లో తెలుగు తంబీలు, Telugu actors in Kollywood
Image : courtesy with eenadu news paper. టాలీవుడ్ అంటే తెలుగు చిత్రసీమ. ఇక్కడ హీరోలంతా తెలుగువారే. మరి కోలీవుడ్ అంటే... తమిళ చిత్రసీమ. కానీ అక్కడ హీరోలలో తమిళులే కాదు తెలుగువారూ ఉన్నారు. ముఖ్యంగా యువ కథానాయకుల్లో... కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు హీరోల్లో విశాల్ ఒకడు. తండ్రి జి.కె.రెడ్డి సినీ నిర్మాత. ఓ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన విశాల్, 2004లో కోలీవుడ్‌లో 'చెల్లమే' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. అతడి తమిళ సినిమాలు ప్రేమచదరంగం, సెల్యూట్‌ి, పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, పిస్తా, వాడు-వీడు... పేర్లతో తెలుగులోకీ అనువాదమై వచ్చాయి. ఇంతవరకూ తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ విశాల్‌కు టాలీవుడ్‌లోనూ యాక్షన్ హీరోగా మంచి ఆదరణ ఉంది. విశాల్ అన్నయ్య విక్రమ్‌కృష్ణ కోలీవుడ్‌లో నిర్మాత. 'రంగం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జీవా. ఇతడు సూపర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి కొడుకు. తమిళ్‌లో సుమారు 20 సినిమాలు చేశాడు. సొంత బ్యానర్‌తోనే వెండితెరకు పరిచయమైనా తర్వాత నెమ్మదిగా తనలోని నటుణ్ని నిరూపించుకుని ఇతర నిర్మాణ సంస్థలతోనూ ...