సుర్వీన్ చావ్లా , Surveen chawla
- పరిచయం : సుర్వీన్ చావ్లా పంజాబీ బాలీవుడ్ నటి . తెలుగు లో " రాజు మహారాజు " సినిమాలో శర్వానంద్ తో జంట గా నటిచారు . అర్జున్, సుర్విన్ చావ్లా జంటగా రూపొందిన ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్’ అనే తమిళ చిత్రం తెలుగులో ‘ఇట్లు ప్రేమతో’ పేరుతో విడుదల కానుంది. భద్రకాళి ప్రసాద్, పెదబాబు ఈ చిత్రాన్ని అనువదించారు. బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ తిరుప్పంగళ్ చిత్రంలో నటించారు. తాజాగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న జైహింద్-2 లో హీరోయిన్ ఈ అమ్మడే. బాలీవుడ్‌లో హిమ్మత్ వాలా చిత్రంలో చిన్న వేషంలో మెరిసిన సుర్విన్ చావ్లా ప్రస్తుతం దక్షిణాది చిత్రాలనే నమ్ముకుందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ అర్జున్ జైహింద్-2 చిత్రంలో హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రం తన నటనకు కచ్చితంగా ప్రశంసలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తెరపైకొచ్చిన హేట్ స్టోరీ – 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది....