Indraganti Srikanth Sharma-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
పరిచయం (Introduction) : ఇంద్రగంటి శ్రీకాంత శర్మ--సినిమాల్లో చక్కని పాటలు రాసిన కవి, పండితుడు, కథారచయిత, పత్రికా సంపాదకుడు,ఇంద్రగంటి శ్రీకాంతశర్మది పండిత వంశం. భాషాప్రవీణులయ్యారు. ఎమ్.ఎ. పూర్తిచేశాక కొంతకాలం విద్యాబోధన ఉద్యోగం చేశారు. 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో ఉప సంపాదకుడిగా, 'ఆంధ్రప్రభ' వారపత్రికకు సంపాదకుడిగా చాలాకాలం పనిచేశారు. ఎక్కువ కాలం- అంటే 20 సంవత్సరాలు ఆకాశవాణి, విజయవాడలో కార్యనిర్వాహకుడిగా పనిచేసి, ఎన్నో మంచి కార్యక్రమాల ప్రసారానికి దోహదం చేశారు. మంచి నాటకాలు, రూపకాలు రాయించి ప్రసారం చేయించారు. ఉత్తమ సాహిత్యాభిరుచిని పెంపొందించారు. ఆ సంగీత, సాహిత్య ప్రసంగాల కోసం శ్రోతలు ఉవ్విళ్లూరేవారు. నిజామాబాద్‌కు బదిలీ అయ్యాక, కొంతకాలం పనిచేసి రిటైర్ అయ్యారు శర్మగారు. కథలు, నాటకాలు, పాటలు, పద్యాలు, గేయాలూ ఒకటేమిటి- అన్నీ రాశారాయన. జీవిత విశేషాలు (profile) : పేరు : ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, చదువు : ఎం.ఎ. భార్య : జానకీబాల (సుప్రసిద్ధ కథారచయిత్రి-వివాహం (1966) ), తండ్రిగారు : హనుమచ్ఛాస్త్రిగారు- సంతానం : అమ్మాయి, అబ్బాయ...