Posts

Showing posts with the label Suryakantham(actress)-సూర్యకాంతం

సూర్యకాంతం , Suryakantham

Image
పరిచయం (Introduction) : సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్థల శిరోమణి-ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త..సూర్యకాంతం.ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.సుమారు 700 పైగా సినిమాలలో నటించారు. జీవిత విశేషాలు (profile) : పేరు : సూర్యకాంతం , పుట్టినతేది : 28-అక్టోబర్ -1920 , పుట్టిన ఊరు : వెంకట కృష్ణరాయపురము -తూర్పు గోదావరి జిల్లా ., తండ్రి : పొన్నాడ అనంతరామయ్య , తల్లి : పొన్నాడ రత్నమ్మ , భర్త : పెద్దిబొట్ల చలపతిరావు (హైకోర్టు జడ్జి ) --1950 లో వివాహము ., మరణము : 18- డిసెంబర్ -1996 - సహజ మరణము . సినీ జీవితము : తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ...