A,R.Rehana-ఎ.ఆర్.రెహాన (సింగర్ , సంగీత దర్శకురాలు)
పరిచయం (Introduction) : చూసిన వారెవరికయినా ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి అని! ప్రతిభ, సేవాగుణంలోనూ తమ్ముడికేం తక్కువ కాదు. గాయనీ, సంగీత దర్శకురాలూ, పాటల రచయిత్రీ, ఆర్జే... వీటితో పాటూ 'రెయిన్‌డ్రాప్స్' స్వచ్ఛంద సంస్థకి ప్రచార కర్త. మహిళా సాధికారత, బాలికా విద్యపై పనిచేస్తున్న రెహనా ఆ వివరాలను ఇలా చెబుతున్నారు. 'కడసారి వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు' మణిరత్నం 'అమృత'లోని పాట. శ్రీలంక నుంచి మనదేశానికి శరణార్థులు కట్టుబట్టలతో వలస వచ్చే సన్నివేశం. మాతృభూమితో అనుబంధాన్ని వదులుకుని వచ్చే ఆ సందర్భం గురించి దర్శకుడు చెప్పారు. ఓసారి కళ్లు మూసుకుని, ఆ దృశ్యాన్ని తలుచుకున్నా! మాతృభూమిని వదిలివెళ్లడం అంటే మన వేర్లని మనమే బలవంతాన తెంపుకోవడం. ఇది తలుచుకోగానే ఒక్కసారిగా ఆ దృశ్యం తాలూకు భావోద్వేగం... అది 'కడసారి వీడ్కోలు.. కన్నీటితో మా చేవ్రాలు..' పాట రూపంలో బయటికొచ్చింది. కళ్లు తెరిచేసరికి ఎదురుగా మణిరత్నం గారు. 'అద్భుతంగా పాడావమ్మా..' అంటూ ప్రశంసించారు. ఆయన అలా అన్నాక, ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్న మా తమ్ముడు రె...