Posts

Showing posts with the label Akkineni Sanjivi-అక్కినేని సంజీవి(సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు)

Akkineni Sanjivi-అక్కినేని సంజీవి(సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు)

Image
image: Akkineni Sanjeevi  : courtesy with Akkineni Sreekar prasad. పరిచయం (Introduction) : అక్కినేని సంజీవి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు. వీరి కుమారుడే 15 భాషలలో సినిమాలకు ఎడిటింగ్ చేసిన వ్యక్తిగా లిమ్కా బుక్ రికార్డులలో స్థానం సంపాదించి ... జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్.  అక్కాచెల్లెలు  చిత్రానికి దర్శకత్వం వహించిన  అక్కినేని సంజీవి. . . ఇంకా ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.   ఆ దర్శకుడు అంతకుముందు ఎడిటింగ్ శాఖలో ప్రసిద్ధుడు. అక్కినేని సంజీవి గారు ఎడిటింగ్ లో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి క...