శోభన్ బాబు, Sobhan Babu
=================================== పరిచయం : శోభన్ బాబు గా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (1937-2008) విస్తృతంగాప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కధా నాయకుడు. అధికంగాకుటుంబ కధా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కధలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించాడు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ప్రొఫైల్ : పేరు :శోభన్ బాబు, అసలు పేరు : ఉప్పు శోభనా చలపతిరావు. పుట్టిన తేది : జనవరి 22, 1937 న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఊరు : కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు : ఉప్పు సూర్యనారాయణ రావు. తోబుట్టువులు : ముగ్గురు సోదరీమణులు (ధనరంగ ,ఝాన్సీ ,నిర్మల),ఒక సోదరుడు-సాంబశివరావు, కులము : కమ్మ - హిందూ , భార్య : శాంత కుమారి (పెళ్లి రోజు - 15 మే 1958 ), పిల్లలు : ఒక కుమార...